వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.152 కోట్లతో కాటన్ బ్యారేజీకి కొత్త గేట్లు

గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రూ.152.95 కోట్ల వ్యయంతో సర్ ఆర్థర్ కాటన్ (ధవళేశ్వరం) బ్యారేజీకి 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం, వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...