వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి డెల్టా ఆధునీకరణపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రతిష్టాత్మక 'అఖండ గోదావరి ప్రాజెక్టు'ను ప్రారంభించనుందని, తదుపరి గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో మాట్లాడిన సీఎం.. ధవళేశ్వరం బ్యారేజీ రక్షణ కోసం రూ.152 కోట్లతో 117 కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

