వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి ఒకటో పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ గౌడ్, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై చర్చించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సహకారం కోరారు. ఆత్మీయంగా జరిగిన ఈ భేటీలో పట్టణ భద్రతపై పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

