వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలోని 61 పంచాయతీల్లో రూ.1.91 కోట్ల అక్రమాలు జరగడంపై పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మకంతో కట్టే పన్నుల డబ్బును దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదని, ప్రజాధనాన్ని ముట్టుకుంటే చేతులు కాలిపోతాయని ఆయన అధికారులను గట్టిగా హెచ్చరించారు.
అధికారులంటే కేవలం అక్రమాలు, అవినీతే కాదని.. ప్రజల సొమ్మును కాపాడే నిజాయతీపరులు కూడా ఉంటారని ఆయన గుర్తుచేశారు. అధికారులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

