Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై మళ్లీ దాడుల అంశంపై ట్రంప్‌తో నెతన్యాహు చర్చలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 29, 2026 10:40 AM అమరావతిGeneral
ఇరాన్‌పై మళ్లీ దాడుల అంశంపై ట్రంప్‌తో నెతన్యాహు చర్చలు - Udayam
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇరాన్ నుంచి ముప్పు పెరుగుతోందని పేర్కొంటూ సంబంధిత నిఘా సమాచారాన్ని ట్రంప్‌కు అందించినట్లు ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయడం తప్ప మార్గం లేదని నెతన్యాహు అభిప్రాయపడినట్లు తెలిపాయి. దీనిపై ట్రంప్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...