Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

203 పరుగుల తేడాతో నెల్లూరు ఘన విజయం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 2:32 PM నెల్లూరుGeneral
203 పరుగుల తేడాతో నెల్లూరు ఘన విజయం - Udayam
సౌత్ జోన్ అండర్-23 మహిళల వన్డే టోర్నీలో నెల్లూరు జట్టు కడపపై 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నెల్లూరు 50 ఓవర్లలో 8 వికెట్లకు 403 పరుగులు చేయగా, జెస్సికా (107), మహాలక్ష్మి మనోజ్ (167) సెంచరీలతో రాణించారు. 404 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కడప జట్టులో ప్రశంస 102 పరుగులతో సెంచరీ చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో జట్టు 50 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమైంది.

Comments

G
Loading comments...