Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 3:18 PM శ్రీకాకుళంGeneral
నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన - Udayam
పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 44 వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా శనివారం నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ ఏ. రాంగోపాల్‌రావు అధ్యక్షతన నేత్రదానం ప్రాముఖ్యతను వివరించారు. నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ మాట్లాడుతూ ఒక్కరి నేత్రదానం ఇద్దరికి చూపునిస్తుందని తెలిపారు. మరణించిన ఆరు గంటల్లోపు నేత్రాలను సేకరించాలని సూచించారు . విద్యార్థులతో నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు .

Comments

G
Loading comments...