వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో మహారాష్ట్రకు చెందిన డాక్టర్ మనోజ్, కోచింగ్ సెంటర్ టీచర్ తేజస్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో కీలక పాత్ర పోషించారని అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 13కి చేరింది. దేశవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ.. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు మరియు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేసింది.
Comments
Loading comments...

