Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల కట్టడిలో ప్రతిభ.. ముగ్గురు కానిస్టేబుళ్లకు రివార్డులు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 19, 2026 7:51 AM ఆదిలాబాద్General
నేరాల కట్టడిలో ప్రతిభ.. ముగ్గురు కానిస్టేబుళ్లకు రివార్డులు - Udayam
నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు కానిస్టేబుళ్లను ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అభినందించారు. రిమ్స్‌ వద్ద కత్తులు, తల్వార్లు పట్టుకున్న ఎం.సాయి, రైల్వేస్టేషన్‌లో గంజాయి స్వాధీనం చేసుకున్న కే.కిషోర్‌లను ప్రశంసించారు. బస్టాండ్‌లో మొబైల్‌ చోరీదారుడిని పట్టుకున్న ఎస్.నగేష్‌కు కూడా ప్రశంసాపత్రం, నగదు రివార్డు అందజేశారు. విధుల్లో అప్రమత్తతతో పనిచేసినందుకు వీరిని అభినందించినట్లు ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...