Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేర రహిత వికారాబాద్‌కు సహకరించాలి: వైస్ చైర్మన్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 3:20 PM వికారాబాద్General
నేర రహిత వికారాబాద్‌కు సహకరించాలి: వైస్ చైర్మన్ - Udayam
నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్‌రెడ్డి కోరారు. వికారాబాద్ పట్టణంలోని సీసీ కెమెరాల మరమ్మతుల కోసం రూ.2 లక్షల చెక్కును అందజేశారు. నేరాల నియంత్రణలో తనవంతు బాధ్యతగా ఈ సాయం చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించి నేర రహిత వికారాబాద్ నిర్మాణానికి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...