వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బంట్వారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై విమల సూచించారు. శిథిలావస్థలోని ఇళ్లలో ఉండకుండా సురక్షిత భవనాలకు వెళ్లాలని, వరద నీటితో నిండిన రహదారులు, వాగులు దాటవద్దని హెచ్చరించారు.
విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

