Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు గుంటూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:36 AM గుంటూరుGeneral
నేడు గుంటూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
రహదారి విస్తరణ పనుల కారణంతో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో బుధవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈలు హుస్సేన్ ఖాన్, గురవయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని స్పష్టం చేశారు. పనుల దృష్ట్యా స్థానిక విద్యుత్ వినియోగదారులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...