Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నదిలో కాళ్లకు గొలుసులతో నవదంపతులు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:11 PM జాతీయంGeneral
నదిలో కాళ్లకు గొలుసులతో నవదంపతులు - Udayam
మహారాష్ట్ర ధూలే జిల్లాలోని తాపి నదిలో కాళ్లకు ఇనుప గొలుసులు బిగించి ఉన్న స్థితిలో నవదంపతులు శ్యామ్ హరి పాటిల్, సప్నా శ్యామ్ పాటిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. కొద్ది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల బైక్ నది ఒడ్డున లభించింది. ఎవరైనా హత్య చేసి నదిలో పడవేశారా లేదా వారే ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Comments

G
Loading comments...