వార్తలకు తిరిగి వెళ్లండి
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

కామారెడ్డిలోని బీబీపేట వాసవి క్లబ్ ఆవరణలో 'నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే' (జాతీయ పతాకాన్ని జాతికి అందించిన రోజు) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, జోన్ చైర్మన్ నాగభూషణంతో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...