Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ అడ్వెంచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
రవళి దేవి Jul 30, 2026 7:10 PM ఆదిలాబాద్General
నేషనల్ అడ్వెంచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
సాహస రంగంలో ప్రతిభ కనబరిచిన యువతను గుర్తించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి సతీశ్ యాదవ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 20లోపు https://awards.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...