Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మాల మానేరుకు తగ్గిన వరద

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 9:00 AM రాజన్న సిరిసిల్లGeneral
నర్మాల మానేరుకు తగ్గిన వరద - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం గురువారం పూర్తి స్థాయిలో నిండింది. 2 టీఎంసీల సామర్థ్యం గల జలాశయంలోకి 670 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుడికాలువ ద్వారా 130 క్యూసెక్కులు, స్పిల్‌వే గేట్‌ ద్వారా 540 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 1,482 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి 1,482.50 అడుగులు కాగా, 670 క్యూసెక్కుల నీరు మత్తడి పైనుంచి వెళ్తోంది.

Comments

G
Loading comments...