Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన నాని

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 25, 2026 3:03 PM తిరుపతిGeneral
తిరుమలలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన నాని - Udayam
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు నాని కుటుంబానికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. నానిని చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆలయం వెలుపల అభిమానులు, ముఖ్యంగా యువత భారీగా పోటీపడ్డారు.

Comments

G
Loading comments...