వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
ధనుష్ రెడ్డి Jun 28, 2026 2:59 PM నల్గొండ 6 viewsabout 2 hours ago

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి జాతీయ రహదారిపై మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న మరో రెండు కార్లు ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మృతులను నార్కెట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి దేవేందర్ రెడ్డి (55), దీప సరిత (50)గా గుర్తించారు. ఈ మూడు కార్లలో ప్రమాద సమయంలో మొత్తం పదిమంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...