Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మజ్లిస్ నుండి హైదరాబాద్‌ను రక్షిద్దాం: కిషన్ రెడ్డి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jun 28, 2026 9:51 PM హైదరాబాద్General
మజ్లిస్ నుండి హైదరాబాద్‌ను రక్షిద్దాం: కిషన్ రెడ్డి - Udayam
హైదరాబాద్‌లో పోలీసుల బదిలీలు సెక్రటేరియట్‌లో కాకుండా మజ్లిస్ కేంద్రం దారుసలాంలో జరుగుతున్నాయని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. మజ్లిస్ కబంధ హస్తాల నుండి నగరాన్ని రక్షించుకోవడానికి రాబోయే మూడు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమ వలసదారుల పేర్లు లేకుండా, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ లిస్ట్‌ను సరిచూడాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...