Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?: హరీశ్ రావు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 28, 2026 8:12 PM సిద్దిపేటGeneral
రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?: హరీశ్ రావు - Udayam
రైతుబంధు, వరి కొనుగోళ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్ని నిధులు ఎగ్గొట్టిందో తాము లెక్కలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటోందని, కానీ బీఆర్‌ఎస్ హయాంలో తాము 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...