వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బస్టాండులో 147.5 గ్రాముల బంగారం దొంగిలించిన జి.నూకపావనిని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గుర్తించారు.
తునిలో ఆభరణాలు విక్రయించేందుకు వెళుతుండగా తాండవ వంతెనపై ఆమెను అరెస్టు చేశారు. రూ.12 లక్షలకు పైగా విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో మూడు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితురాలిని రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

