Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో వీడని మిస్టరీ

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:37 PM అల్లూరి General
హత్య కేసులో వీడని మిస్టరీ - Udayam
విశాఖ కొత్తజాలరిపేటలో మైలపల్లి చంటి (30) హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆదివారం రాత్రి ప్రాణహాని ఉందని సోదరి వద్ద ఆందోళన వ్యక్తం చేసిన చంటి.. సోమవారం ఉదయం బీచ్‌లో శవమై కనిపించాడు. మెడకు నైలాన్‌ తాడు బిగించి, కంటి వద్ద కత్తి గాయాలతో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మూడు ప్రత్యేక బృందాలతో సీసీ కెమెరాలు, కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...