Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు గంటలుగా కదలని వాహనాలు

Follow Udayam on Google
B RAJESH Aug 23, 2026 10:01 AM విజయనగరంGeneral
మూడు గంటలుగా కదలని వాహనాలు - Udayam
బొబ్బిలి మండలం పారాది వద్ద వాహనాలు మూడు గంటలుగా ముందుకు కదలడం లేదు. వంతెన వద్ద సాయంత్రం 6 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. మూడు గంటలు గడిచిన ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్లో ఆర్టీసీ, ఇంజినీరింగ్ కళాశాలల బస్సులు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

Comments

G
Loading comments...