Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసు ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 06, 2026 7:17 AM శ్రీకాకుళంGeneral
హత్య కేసు ఛేదించిన పోలీసులు - Udayam
గత నెల 26న జాతీయ రహదారిపై కుజ్జిపేట చెరువుగట్టు వద్ద లభ్యమైన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. లారీ డ్రైవర్ బాపూజీ స్వయిన్‌ను (41) అతని స్నేహితుడు కేదారిదాస్ కక్షతోనే హత్య చేసినట్లు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆదివారం కోటబొమ్మాళిలో వెల్లడించారు. డీజిల్ దొంగతనం వ్యవహారాన్ని యజమానికి చెప్పి తన ఉద్యోగం తీయించాడనే కోపంతో కేదారిదాస్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఒడిశా నుంచి బొబ్బిలికి అట్టల లోడుతో వెళ్తున్న క్రమంలో తోడుగా వచ్చిన నిందితుడు సమయం చూసి బాపూజీని హతమార్చాడు.

Comments

G
Loading comments...