Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.400 కోట్ల అంబేడ్కర్‌ విగ్రహంపై వెలిసిన రంగులు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 06, 2026 7:12 AM అమరావతిGeneral
రూ.400 కోట్ల అంబేడ్కర్‌ విగ్రహంపై వెలిసిన రంగులు - Udayam
వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.400 కోట్లతో విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. ప్రారంభించిన రెండున్నరేళ్లకే విగ్రహం రంగులు వెలిసిపోయి, తెల్లని మచ్చలతో కనిపిస్తోంది. వందల కోట్లు వెచ్చించినా నాణ్యతకు తిలోదకాలిచ్చారని ఆరోపణలు వస్తుండగా.. నాణ్యతా లోపం వల్ల రంగులు వెలిసిపోయిన మాట వాస్తవమేనని, త్వరలోనే మళ్లీ రంగులు వేయిస్తామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సీఈవో మల్లికార్జునరావు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...