వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. అంబేద్కర్ సెంటర్ నుండి భారీ ర్యాలీగా వెళ్ళిన కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కొండా మురళికి వినతి పత్రం అందజేశారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

