Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుభరోసాపై సీఎం రేవంత్‌ను నిలదీసిన కేటీఆర్

Follow Udayam on Google
శివ కుమార్ Jun 30, 2026 1:14 PM హైదరాబాద్General
రైతుభరోసాపై సీఎం రేవంత్‌ను నిలదీసిన కేటీఆర్ - Udayam
రైతుభరోసా నిధుల విడుదల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి సభలు పెట్టి డ్రామాలాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. గత 30 నెలల్లో రూ.30 వేల కోట్ల నిధులను ఎగ్గొట్టి, రైతులను మోసం చేశారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగలా సాగితే, నేడు రేవంత్ పాలనలో దండగగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతు బాంధవుడైతే, రేవంత్ రెడ్డి మాత్రం చరిత్రలో ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారని ఘాటుగా హెచ్చరించారు.

Comments

G
Loading comments...