వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలోని పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు 3 నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందన్నారు.
అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. కుటుంబ పోషణ, నిత్యావసర ఖర్చులు, అప్పుల చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

