వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలం ముక్తాపూర్ గ్రామస్తులు ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం ఏకమయ్యారు. సర్పంచ్ మాన్పూరి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు చెత్తబుట్టలు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు.
శుభకార్యాల్లో ప్లాస్టిక్ వాడకానికి చెక్ పెట్టేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వినూత్నంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేష్, కార్యదర్శి చంద్రభూషణ్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

