వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-కమ్ సెలక్షన్స్ ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి.
స్వర్గీయ కొన్న చిన్నారావు స్మారకంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.అండర్-14, 16, 18, 20 విభాగాల్లో విజేతలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, కొన్న కుటుంబ సభ్యులు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
Comments
Loading comments...

