Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ నియోజకవర్గంలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు

Follow Udayam on Google
Naresh Aug 14, 2026 6:31 PM నిర్మల్General
ముధోల్ నియోజకవర్గంలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు - Udayam
ముధోల్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం ముధోల్, లోకేశ్వరం మండలాల్లోని ఎడ్‌బిడ్ తండా, ఎడ్‌బిడ్, కిష్టాపూర్ గ్రామాలలో రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గాన్ని మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని, అర్హులకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...