వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలోని పీహెచ్ వాడలో ఉన్న ముడుక్కు మారియమ్మ ఆలయంలో ఆడి నెల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి రథోత్సవాన్ని నిర్వహించారు.
అమ్మవారి రథాన్ని చిత్తూరు పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

