వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో వర్షాలు లేక పత్తి, కంది, సోయా పంటలు ఎండిపోతున్నాయి. మూడు వారాలుగా చినుకు జాడలేక, మొలకెత్తిన విత్తనాలు నేలకొరుగుతున్నాయి.
ఎకరాకు రూ.20 వేలకు పైగా వెచ్చించిన రైతులు, మళ్లీ విత్తనాలు వేస్తూ అప్పులపాలవుతున్నారు. బోరుబావుల్లోనూ నీరు అడుగంటింది. చేతికందే పంట కోసం రైతులు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

