వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి నుంచి మంగళాపురం వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యార్థులు నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, రైతులు పంటలను ఇదే కరకట్ట మీదుగా తరలిస్తున్నారు.
వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి వాహనాలు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

