వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో సినిమా టికెట్ల ధరలను పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ముఖ్యమంత్రి విజయ్‌ను కోరారు. చాలా ఏళ్ల క్రితం నిర్ణయించిన ధరలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా టికెట్ ధరల పెంపును పరిశీలించాలని ఆయన సీఎంకు విజ్ఞప్తి చేశారు.
అలాగే, ప్రస్తుతం ఓటీటీల రంగం గందరగోళంగా మారిందని, పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్‌ఫారాన్ని ప్రారంభించాలని కోరారు. ఇది సినిమా రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.
Comments
Loading comments...

