Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నకొడుక్కి నిప్పంటించి తల్లి బలవన్మరణం

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 07, 2026 8:18 AM తిరుపతిGeneral
కన్నకొడుక్కి నిప్పంటించి తల్లి బలవన్మరణం - Udayam
తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. లీలాబాలశ్రావణి (35) అనే మహిళ తన 9 ఏళ్ల కుమారుడు చంద్రమౌళిపై పెట్రోలు పోసి, తాను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన బాలుడు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. కుమార్తె ఇంటి బయట ఉండటంతో ప్రాణాపాయం తప్పగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...