Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపాల్ శివారులో చిరుత సంచారం భయాందోళనలో ప్రజలు

Follow Udayam on Google
Raju Oct 03, 2026 2:17 PM నిజామాబాద్General
మోపాల్ శివారులో చిరుత సంచారం భయాందోళనలో ప్రజలు - Udayam
మోపాల్ మండల శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మోపాల్ తండా నుంచి కాల్పోల్ వెళ్లే దారిలో శుక్రవారం కొందరికి చిరుత కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన వారు వెంటనే సమీప గ్రామాల ప్రజలకు అలర్ట్ చేశారు. శనివారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...