Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూరులో మొహర్రం సంబరం

Follow Udayam on Google
శివ కుమార్ Jun 26, 2026 12:55 PM నారాయణపేటGeneral
ఊట్కూరులో మొహర్రం సంబరం - Udayam
నారాయణపేట జిల్లా ఊట్కూరులో మొహర్రం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులు పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కందూర్లు, సాంస్కృతిక నృత్యాలతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించారు.

Comments

G
Loading comments...