వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం మండలం సీతారామపురానికి చెందిన కూనపురెడ్డి నాగేశ్వరరావు మృతి చెందారు. వై.ఎస్.పాలెంలోని చేపల చెరువుల వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు.
విద్యుత్ మోటార్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. మోటార్ వైర్లు తెగిపోవడంతో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఎస్‌ఐ జయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

