వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని ఆరుగురు తిరుగు ప్రయాణం చేస్తుండగా, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బొలెరో అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రులు తమిళనాడుకు చెందినవారని సమాచారం.
Comments
Loading comments...

