Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనిషి మనుగడకు ఆధారం అడవులు

Follow Udayam on Google
p.g.murthy Sep 19, 2026 7:31 PM మంచిర్యాలGeneral
మనిషి మనుగడకు ఆధారం అడవులు - Udayam
అడవులు, వన్య ప్రాణులతోనే మనుషులకు భవిష్యత్తు ఉంటుందని జన్నారం అటవీశాఖ అధికారులు అన్నారు. శుక్రవారం మండలంలోని బొమ్మన, చింతగూడ గ్రామాలలో ఉన్న ప్రజలకు అడవులు, వన్య ప్రాణులపై కళాకారులతో పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడంలో అడవులు వన్యప్రాణులు ముందు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని అటవీశాఖ అధికారులు కోరారు.

Comments

G
Loading comments...