వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలోని కట్టకిందపాలెం 1 సెంటర్‌లో పోషణ మాసం సందర్భంగా ‘మన అంగన్‌వాడీ - మన బాధ్యత’ అనే నినాదంతో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
చిన్నారులకు పౌష్టికాహారం అందించే విధానాన్ని అంగన్‌వాడీ కార్యకర్త కస్తూరి అవగాహన కల్పించారు. బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలు 6 నెలల వయస్సు దాటిన తర్వాత తగిన అదనపు ఆహారం సకాలంలో అందించేలా చూడాల్సిన ప్రాముఖ్యతను వివరించారు.
Comments
Loading comments...

