Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మల్కాపురం పరిశ్రమలో పేలుడు.. ఒకరు మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 7:24 PM హైదరాబాద్General
మల్కాపురం పరిశ్రమలో పేలుడు.. ఒకరు మృతి - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రీస్‌ పార్క్‌లోని ఆక్సీ-నౌ పరిశ్రమలో ఆక్సిజన్‌ సిలిండర్లు పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్లలో ఆక్సిజన్‌ నింపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బిహార్‌కు చెందిన మనీష్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...