వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రీస్ పార్కులోని ఆక్సీ-నౌ పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్లలో ఆక్సిజన్ నింపుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మృతుడిని బిహార్కు చెందిన మనీష్ కుమార్గా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

