వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ-విశాఖపట్నం మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ నెల 17న విశాఖ నుంచి విజయవాడకు, 19న విజయవాడ నుంచి విశాఖకు రైళ్లు నడుస్తాయి.
ఇవి దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరులో ఆగుతాయి. విజయవాడ-పలాస మధ్య 17, 18 తేదీల్లో, పలాస-విజయవాడ మధ్య 18, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
Comments
Loading comments...

