Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్హర్‌రావులో చేయూత పింఛన్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:18 AM జయ శంకర్ భూపాలపల్లి General
మల్హర్‌రావులో చేయూత పింఛన్ల పరిశీలన - Udayam
మల్హర్‌రావు మండలంలో చేయూత పింఛన్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో కె. క్రాంతికుమార్‌ తెలిపారు. మండలవ్యాప్తంగా 496 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అన్సాన్‌పల్లి, నాచారం, అడ్వలపల్లి, చిన్నతుండ్ల, దుబ్బపేట పంచాయతీలను ఎంపీడీవోకు, ఇప్పలపల్లి, కొండంపేట, వల్లెంకుంట, కొయ్యూరు గ్రామాలను ఎంఈవో జి. లక్ష్మణ్‌బాబుకు కేటాయించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...