వార్తలకు తిరిగి వెళ్లండి
సింహాచలం దేవస్థానం అన్న ప్రసాదశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

విజయనగరం జిల్లా కేంద్రంలోని సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యార్థుల అన్న ప్రసాదశాలను ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విజయనగరం మహారాజులు ప్రారంభించిన ఈ ప్రసాదశాల, ఏళ్లుగా పేద విద్యార్థులకు ఆకలి తీర్చుతోందని ఆమె కొనియాడారు.
ఈ ప్రసాదశాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో జిల్లేపల్లి వెంకట్రావు మరియు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...