Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండె బాధితుడికి ఎమ్మెల్యే చేయూత

శివ కుమార్ Jun 24, 2026 8:52 AM వికారాబాద్ 4 viewsabout 15 hours ago
గుండె బాధితుడికి ఎమ్మెల్యే చేయూత - Udayam Digital
గుండె సంబంధిత సమస్యతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వడ్డె నాగప్పకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. రూ. 2 లక్షల విలువైన ఎల్వోసీ పత్రాలను అందజేసి, ఉచిత శస్త్రచికిత్సకు మార్గం సుగమం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగప్పకు సకాలంలో సాయం అందజేసిన ఎమ్మెల్యే, సర్పంచి రాజ్ కుమార్‌లకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...