Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాఖమూరు పార్కులో మినీ అమెజాన్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 14, 2026 8:52 AM అమరావతిGeneral
శాఖమూరు పార్కులో మినీ అమెజాన్ - Udayam
రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్కులో దట్టమైన అడవిని తలపించేలా ఐదెకరాల విస్తీర్ణంలో ‘మినీ అమెజాన్‌’ కృత్రిమ రెయిన్ ఫారెస్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ మియావాకీ విధానంలో 400 జాతులకు చెందిన 20 వేలకు పైగా చెట్లను ఏడంచెలుగా పెంచుతారు. జీవవైవిధ్య పరిరక్షణ కేంద్రంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.

Comments

G
Loading comments...