Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రకు తరలుతున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

Follow Udayam on Google
raju Aug 29, 2026 10:16 PM నిజామాబాద్General
మహారాష్ట్రకు తరలుతున్న పీడీఎస్ బియ్యం పట్టివేత - Udayam
నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని 6 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ట్రాలీ ఆటోలో సుమారు 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రాలీ ఆటో డ్రైవరు అదుపులోకి తీసుకుని బియ్యానికి సంబంధించిన విచారణ చేపట్టారు. ఇతర వివరాలను అధికారులు విచారణ అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...